
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా గురించి అతని గ్రామస్తులు చెసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లూరి జిల్లాలో భద్రతా బలగాల ఎదురుకార్పులలో మరణించినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా అసలు పేరు దేవా అని అతని గ్రామస్తులు తెలిపారు. హిడ్మా అనేది తన పేరు కాదు అని.. అతని తండ్రి పేరు అని స్థానికులు తెలిపారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం వల్ల అనాధగా పెరుగుతూ తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లేవాడు అని చెప్పారు. అయితే గత ఐదు సంవత్సరాల క్రితం మాత్రమే అతనిని చూశామని.. గ్రామానికి ఏదైనా ఆపద వచ్చింది అంటే కచ్చితంగా ఆదుకునే వాడని అతని గ్రామస్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామంలోనే ప్రతి ఒక్కరం కూడా పోలీసులకు లొంగిపోమని ఎన్నోసార్లు చెప్పాము. అయినా కానీ మా మాట వినలేదు. ఇప్పుడు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ లో మరణించడం అనేది చాలా బాధగా ఉంది అంటూ గ్రామస్తులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా మావోయిస్టు పార్టీకి హిడ్మా కీలకమైన వ్యక్తి. హిడ్మాతోపాటు ఆయన భార్యను కూడా పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. 2026 మార్చి 31వ తేదీ లోపు దేశవ్యాప్తంగా మావోయిజం లేకుండా చేస్తామని ఇప్పటికే హోం మంత్రితో పాటు ప్రధాన మంత్రి కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే.
Read also : బాబు లేటెస్ట్ లుక్స్… అదిరిపోయాడు అంతే!
Read also : రైతన్నలకు వెన్నుపోటు పొడవడం మీ వల్లే సాధ్యం : వైసీపీ





