-
హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ పొయ్యకండి
-
ఈ నిబంధనను హుల్లంగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎన్డి ప్రసాద్
క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిది: “నో హెల్మెట్ – నో పెట్రోల్” (No Helmet – No Petrol) అనే నిబంధనను రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మండల ఎస్ఐ డీ.వెంకటేశ్వర్లు అన్నారు.

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బుదవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ డీ.వెంకటేశ్వర్లు అధ్వర్యంలో పొలిసు సిబ్బందితో “నో హెల్మెట్ – నో పెట్రోల్” (No Helmet – No Petrol) కార్యక్రమంలో బాగంగా బారీ బైక్ ర్యాలితో ప్రజలకు అవగాహనా కలిగే విదంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎన్డి ప్రసాద్ ముఖ్యఅతిదిగా హాజరైయ్యారు.

ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ…”నో హెల్మెట్ – నో పెట్రోల్” (No Helmet – No Petrol) అనే నిబంధనను రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం మరియు పోలీసులు అమలు చేస్తున్నారు అన్నారు. 2026 నాటికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు మరియు జిల్లాల్లో ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాము అన్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదని యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం అన్నారు. నల్గొండ జిల్లాలో జనవరి 7, 2026 నుండి ఈ నిబంధనను కఠినంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అమలు చేస్తున్నారు అన్నారు.

ఈ నిబంధనను పెట్రోల్ బంకు యజమానులు హుల్లంగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎన్డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య, మాడుగులపల్లి పొలిసు సిబ్బంది, వేములపల్లి సిబ్బంది పాల్గొనారు..





