క్రీడలు

నో షేక్ హాండ్స్.. నో హగ్స్.. టీమిండియాను మెచ్చుకుంటున్న అభిమానులు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-యూఏఈ వేదికగా, ఆసియా కప్ లో భాగంగా నిన్న రాత్రి 8 గంటలకు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య టి20 మ్యాచ్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ ను చిత్తు చిత్తు చేసింది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఇక 128 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.5 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తిచేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కుల్దీప్ యాదవ్ నిలిచారు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా బ్యాట్స్మెన్లు చేసిన పనికి భారత్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా తెగ సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్లేయర్స్ ను టీమ్ ఇండియా క్రికెటర్స్ అవమానించారు. ఎందుకంటే… నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఆడడం ఎవరికి కూడా ఇష్టం లేదు. ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ దేశంపై భారత దేశ ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. నిన్న మ్యాచ్ ప్రారంభం అయ్యేంతవరకు కూడా.. ఈ మ్యాచ్ జరగకూడదు అని.. వెంటనే బాయ్ కాట్ చేయాలని కూడా ఇండియన్ క్రికెట్ అభిమానులు కోరుకున్నారు.

Read also : విలన్ పాత్రకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ.. రూల్స్ ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘనవిజయం సాధించింది. కానీ నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా అందరి అంచనాలను నిలబెడుతూ పాకిస్తాన్ కి షాక్ ఇచ్చారు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన వెంటనే ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ అలాగే హగ్స్ ఇచ్చుకుంటారు. కానీ నిన్న మ్యాచ్ అనంతరం నాట్ అవుట్ గా నిలిచిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, శివం దూబే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. పాకిస్తాన్ ఆటగాలని చూడకుండా మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు కూడా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెంటనే వెళ్ళిపోయారు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ ను లైవ్ లో చూస్తున్నా ఇండియన్ క్రికెట్ అభిమానులు చాలా సంతోషపడ్డారు. కెప్టెన్ సూర్య భాయ్ మంచి పని చేశాడు అని… ఇది ఒక రకమైన నిరసన అని ఇండియన్ క్రికెటర్స్ ను చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ సమయంలో కూడా పాకిస్తాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ అనేది ఇవ్వలేదు. ఏదో ఫార్మల్ టీ కి మ్యాచ్ ఆడాలి కాబట్టి ఆడాం.. అన్నట్లు భారత ఆటగాళ్లు వ్యవహరించారు. చివరికి పాకిస్తాన్ జట్టు ను చిత్తు చేసి భారత అభిమానులకు చాలానే సంతోషం కలిగించారు.

Read also : మరో 5 రోజులు పాటు భారీ వర్షాలు.. అయోమయంలో ప్రజలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button