
అద్దంకి – నార్కట్పల్లి రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్..
స్థానిక తహసిల్దార్ వచ్చేంతవరకు ధర్నా విరమించం
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి: ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు జరగడంలేదని అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన చెంది అద్దంకి నార్కట్పల్లి రహదారిపై రైతులు బెటాయించి ధర్నాకు చేస్తున్న ఘటన మాడుగులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది…
Also Read:బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం?
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని తరలించి దాదాపుగా నెల రోజులు కావస్తున్న అక్కడ సిబ్బంది ధాన్యం కొనుగోలను చేయడం లేదని ఆవేదన చెందుతూ శనివారం అద్దంకి నార్కట్పల్లి హైవేపై కేటాయించి రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు.. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు ఎక్కడి ఎక్కడ ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది..
నెలరోజులు కావస్తున్న కాంటాలు వేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు వెతుకుతున్నాయి. ఐకెపి సిబ్బందిని కాంటాలు వేయమని అడిగితే ఎవరు కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తడిసిన ధాన్యం కుప్పలను ఆరబెట్టినప్పటికీ కూడా కొనుగోలు కొనసాగించకపోవడంతో రైతుల అగ్రహం కట్టలు తెంపుకుంది..
దీంతో ఒక్కసారిగా రైతులందరూ రోడ్డుపైకి బేటాయించి నిరసన వ్యక్తం చేశారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.. స్థానిక తహసిల్దార్ తక్షణమే మా వద్దకు వచ్చి మా సమస్యకు పరిష్కారాన్ని చూపాలని లేకుంటే ఈ ధర్నాను విరమించేది లేదని రైతులు చెబుతున్నారు…
Also Read:నేడే చివరి వన్డే… తెలుగు ప్లేయర్ అవుట్?





