జాతీయంతెలంగాణరాజకీయం

బీఆర్‌ఎస్‌ వద్దు టీఆర్‌ఎస్‌ ముద్దు - పేరు మార్పుకు డేట్‌ ఫిక్స్‌ - తప్పు సరిచేసుకుంటున్న కేసీఆర్‌

కేసీఆర్‌కు కనువిప్పు కలిగిందా..? చేసిన తప్పు తెలుసుకున్నారా? బీఆర్‌ఎస్‌తో మనుగడ ఉండదు… టీఆర్‌ఎస్‌ అయితేనే బెస్ట్‌ అని అనుకుంటున్నారా..? అందుకే పార్టీకి పాతపేరే పర్ఫెక్ట్‌ అని డిసైడ్‌ అయ్యారా..? అంటే అవుననే అంటోంది గులాబీ దళం. పార్టీ పేరు మార్పునకు ముహూర్తం కూడా ఫిక్సై పోయిందని చెప్తోంది.

టీఆర్‌ఎస్‌.. అంటే తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌. ఉద్యమ పార్టీగా ప్రజలకు దగ్గరైంది. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ… తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌ అన్నట్టు ప్రజల్లో పాతుకుపోయి ఉండేది. కానీ… పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చినప్పటి నుంచి… సీన్‌ రివర్స్‌ అయ్యింది. పార్టీ ప్రజలకు దూరమైంది. వరుస ఓటములను చవిచూస్తోంది. దీంతో కేసీఆర్‌కు చేసిన తప్పు తెలిసొచ్చినట్టుంది. అందుకే మళ్లీ పార్టీకి పాత పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు పార్టీకి మళ్లీ పాత పేరు పెట్టినంత మాత్రాన పూర్వవైభవం వస్తుందా…? ప్రజల నమ్మకాన్ని మళ్లీ చూరగొంటుందా?

Read More : 2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?

టీఆర్‌ఎస్‌.. తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ పార్టీ. తెలంగాణను సాధించిన పార్టీ. టీఆర్‌ఎస్‌ పేరులోనే తెలంగాణ ఉంది. అందుకేనేమో ప్రజలకు అంతగా కనెక్ట్‌ అయ్యింది. టీఆర్‌ఎస్‌కు వరుసగా రెండు సార్లు అధికారం అప్పగించారు తెలంగాణ ప్రజలు. 2014, 2018 ఎన్నికల్లో భారీ విజయం అందించారు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత… కేసీఆర్‌ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనుకున్నారు. కేంద్రంలో కీలకంగా మారాలనుకున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు. అప్పటి నుంచే బ్యాడ్‌ టైమ్‌ మొదలైందో ఏమో..? 2023 ఎన్నికల్లో ఓటమి తలుపుతట్టింది. ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ జీరో అయ్యింది బీఆర్‌ఎస్‌.

అసలు, టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం సొంత పార్టీలో చాలా మంది నేతలకు ఇష్టం లేదనే చెప్పాలి. కానీ, అధినేత నిర్ణయాన్ని శిరసావహించక తప్పలేదు. మొత్తానికి 2022 డిసెంబర్‌ 9న టీఆర్‌ఎస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌ అయ్యింది. అప్పటి నుంచి కేసీఆర్‌కు, ఆయన పార్టీకి కష్టాలు తప్పలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా పేరు మార్చడాన్ని… ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా మలుచుకున్నాయి. పార్టీ నుంచి తెలంగాణ అన్న పేరును తొలగించారని.. దీంతో తెలంగాణతో కేసీఆర్‌కు, ఆయన పార్టీకి ఉన్న సంబంధం తెగిపోయిందని విమర్శించారు. వారు అన్నట్టుగానే ప్రజలు కూడా భావించారో ఏమో..? బీఆర్‌ఎస్‌తో మాకేంటి సంబంధం అని పక్కన పెట్టేశారు. దీంతో.. కేసీఆర్‌కు ఆయన చేసిన తప్పు తెలిసొచ్చినట్టుంది. అందుకే… ఇప్పుడు పార్టీకి మళ్లీ పాత పేరే పెట్టాలని అనుకుని ఉండొచ్చు. మరి… పార్టీ పేరు మార్పు ఎప్పుడు..? ఎక్కడ..? జరగబోతోంది.

Read More : ఉస్మానియా జోలికొస్తే బొందపెడతం.. సీఎం రేవంత్‌కు బీజేపీ వార్నింగ్

ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాలకు సిద్ధమవుతోంది. ఆ సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభకు నిర్వహిస్తోంది. ఆ సభా వేదికగానే పార్టీ పేరు మార్పు ఉంటుందని అంటున్నాయి గులాబీ వర్గాలు. బీఆర్‌ఎస్‌ పేరును… మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటిస్తారని చెప్తున్నారు. పేరులో మళ్లీ తెలంగాణను చేర్చి… పార్టీకి పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button