
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగ వాతావరణం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వచ్చేనెల 8వ తారీఖున ఘనంగా జరగబోతుంది. అయితే ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఐపీఎల్ లో విధ్వంసం సృష్టించినటువంటి ప్లేయర్స్ కూడా పలువురు ఉన్నారు. తాజాగా టీమిండియా ప్లేయర్, వైజాగ్ బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ జట్టులో ఆడునున్నారు. భీమవరం బుల్స్ జట్టు కెప్టెన్గా నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. కాగా వచ్చేనెల అనగా ఆగస్టు 8వ తేదీ నుంచి జరగబోయేటువంటి ఆంధ్ర ప్రిమియర్ లీగ్ లో నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్నారు.
ఇక ఈ ఏడాది జరగబోయేటువంటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఈసారి ఏడు కొత్త జట్లతో టోర్నీ అనేది జరుగునుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం ఏడుజట్ల పేర్లను కూడా సిద్ధం చేసింది. భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్సైనర్స్ టీమ్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ ఏడు జట్లు తెలపడనున్నాయి. కాగా ఇప్పుడు లాగానే ఈసారి కూడా అన్ని మ్యాచ్లు కూడా విశాఖపట్నంలోని స్టేడియంలోనే జరుగుతాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లాగానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈసారి చాలా రసవత్తరంగా సాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు అందరూ కూడా వైజాగ్ లో మ్యాచ్లు వీక్షించవచ్చు. ఈసారి భీమవరం బుల్స్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా ముంబై ఇండియన్స్ కు ఆడినటువంటి సత్యనారాయణ రాజు కూడా ఈ జట్టులో ఉన్నారు.