ఆస్ట్రేలియా గడ్డమీద నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం భారతదేశానికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. కష్ట సమయంలో ఏమాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా సెంచరీ చేసిన తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డికి యావత్ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే ఎన్నో సందర్భాలలో నితీష్ కుమార్ రెడ్డి నాకు రోల్ మోడల్ మరియు స్ఫూర్తిగా విరాట్ కోహ్లీని తీసుకుంటానని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే.
కొల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మ హత్య
ఇక తాజాగా విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన నితీష్ కుమార్ రెడ్డి కి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. నితీష్ కుటుంబంతో ఫ్యామిలీ ఫోటో దిగగా వారందరూ కూడా చాలా సంతోషించారు. ఒక అభిమానిగా అభిమానించే స్థాయి నుంచి ఆ అభిమాన ఆటగాడి చేతులు మీదుగా డెబ్యూ క్యాప్ అందుకొని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో భాగంగా అద్భుతమైన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
అదే బోరుబావిలో కలెక్టర్ పిల్లలు పడితే నిర్లక్ష్యం చేస్తారా?
ఇక భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతాడని భావోద్వేగంతో రవి శాస్త్రి కూడా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్లో ఆడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ని బౌలింగ్లో కూడా బాగా నైపుణ్యం పెంచుకుంటే టీమిండియాలో తిరుగులేని వ్యక్తిగా మారుతాడని చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా భవిష్యత్ ఆల్రౌండర్ గా ఎదుగుతారు అంటూ చాలా మంది నితీష్ పై ప్రశంసలు వెదజల్లుతున్నారు.
నేడే ప్రో కబడ్డీ ఫైనల్స్!.. పాట్నా VS హర్యానా!.. గెలుపు ఎవరిది?