ఆంధ్ర ప్రదేశ్సినిమా

రాబిన్ హుడ్ మూవీ రివ్యూ!…హిట్ పడిందా… లేదా?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఇవాళ రిలీజ్ అయిన రాబిన్ హుడ్ ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే నితిన్ సాధారణ వ్యక్తిగతను లైఫ్ను లీడ్ చేస్తూ ఒక సీక్రెట్ మిషన్ ను రన్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో హీరో నితిన్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.. తను రాబిన్హుడ్గా ఎలా మారాల్సి వచ్చింది అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఈ సినిమా చూడాలి.

ఈ సినిమా ద్వారా వెంకీ కుడుముల ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కేతిక శర్మ చేసిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో చాలానే రూమర్స్ వచ్చినా కూడా థియేటర్ రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంటుంది. వెంకీ కుడుముల తను చెప్పాలనుకున్న పాయింట్ను స్ట్రైట్ గా చెప్పేసాడు. ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే నితిన్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్గా శ్రీ లీల కూడా బాగా నటించింది. ఇక రాజేంద్రప్రసాద్ అక్కడక్కడ కామెడీట చేస్తూ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కట్టి పారేస్తాడు. ఇక ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర కొంచెమే అయినా కూడా చాలా బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు చాలా వరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి.

ఫైనల్ గా రేటింగ్ :- 3.0/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button