ఆంధ్ర ప్రదేశ్

రుషికొండ ప్యాలెస్‌కు మించి – అమరావతిలో ఇంద్రభవనం – వేరే లెవల్‌

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- రుషికొండ ప్యాలస్‌… వైసీపీ హయాంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖలో నిర్మించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ భవనంపై ఎన్ని విమర్శలు వచ్చాయో…! ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ జగన్‌ పార్టీపై మూకుమ్మడి దాడి చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… ఆ భవనం లోపలి విజువల్స్‌ వైరల్‌ అయ్యాయి. అవి చూసి… రాజభవనంలా నిర్మించుకున్నారని అందరూ నోరెళ్లబెట్టారు. ఇంత రాజభోగం అవసరమా..! అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే… అమరావతిలో రుషికొండకు మించిన ఇంద్రభవనాన్ని నిర్మించబోతున్నారు. ఆ భవనం డిజైన్‌ చూసిన ఎవరికైనా మతిపోవాల్సిందే.

విజయవాడ తాడిగడపలో జంట టవర్ ఐకాన్ పేరుతో ఈ భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు. అమరావతి అభివృద్ధిలో ఈ భవనం కీలకమని చెప్తోంది కూటమి ప్రభుత్వం. NRIల సహకారంతో APNRT సొసైటీ ద్వారా నిర్మించబోతున్న ఈ ఇంద్రభవనం… అమరావతి పునర్‌నిర్మాణానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందట.

భవనం డిజైన్‌ చూస్తే కళ్లు చెదిరిపోతున్నాయి. 36 అంతస్తులు… రెండు టవర్లు. ఒక టవర్‌లో నివాసాలు… మరో టవర్‌లో ఆఫీసులు ఉంటాయట. పైనున్న నాలుగు అంతస్తులు మాత్రం.. పూర్తిగా కమర్షియల్‌. ఈ భవనంలో ఆధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లలో అమరావతి కట్టి చూపిస్తానంటున్న సీఎం చంద్రబాబు… ఈ భవన నిర్మాణానికి 2028 టార్గెట్‌గా పెట్టుకున్నారు. 600 కోట్లు ఖర్చు పెట్టి కడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 30వేల ఉద్యోగ అవశాలు కలుగుతాయట. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు పెడుతోంది ప్రభుత్వం. అక్కడ నిర్మించే ప్రతి కట్టడాన్ని అద్బుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది మొత్తంగా… ఈ జంట టవర్‌ డిజైన్‌ చూస్తే.. ఔరా అనక తప్పదు.

పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025.. ముఖ్య అతిథిగా చందుపట్ల రాజిరెడ్డి

మొన్న రోహిత్.. నేడు విరాట్ కోహ్లీ.. రోజుల వ్యవధిలోనే స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button