
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- కన్న తల్లి… తన 15 రోజుల నవజాత శిశువును ఫ్రీజర్ లో పెట్టి మర్చిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియా అంతటా కూడా తెగ వైరల్ అవుతుంది. అసలు కన్న బిడ్డను ఫ్రీజర్ లో పెట్టడానికి కారణం ఏంటి?.. ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోరాదాబాద్ లో శుక్రవారం రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసవం అనంతరం ఒక తల్లి మానసిక వ్యాధికి గురవడంతో తన 15 రోజుల నవజాత శిశువును ఫ్రీజర్ లో పెట్టి మర్చిపోవడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఫ్రీజర్ లోని ఆ చిన్నారి మెల్లిగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ ఏడుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరుగెత్తుకు వచ్చి ఫ్రీజర్లో నుంచి ఆ బిడ్డను బయటకు తీశారు.
Read also : సీఎం పై ప్రశంసలు.. ఇంటి కాంపౌండ్ ను కూల్చిన.. నోరు మెదపని ఫ్యామిలీ?
ఇక వెంటనే క్షణం ఆగకుండా… ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో డాక్టర్లు ఆ చిన్నారిని పరిశీలించి మీ బిడ్డకు ఏమి కాలేదు అని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రసవం అనంతరం ఆ తల్లి మానసిక రోగానికి గురవడంతోనే ఈ ఘటన జరిగిందని వైద్యులు తేల్చి చెప్పారు. సాధారణంగా మహిళలు ప్రసవం అయిన తర్వాత హార్మోన్లలో కొంతమందికి మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఆ తల్లి అలా ప్రవర్తించిందని వైద్యులు చెప్పుకొచ్చారు. అటువంటి క్షణాల్లో సరైన వైద్యం చేయించకపోతే బిడ్డకు ఎటువంటి రూపంలోనైనా సరే హాని చేయడం వంటివి చేయడం లేదా తమకు తాము హానికీ పాల్పడడం వంటివి చేస్తారని వైద్యులు కీలక విషయాలను తెలిపారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తో పాటుగా సోషల్ మీడియా అంతటా కూడా తెగ వైరల్ అవుతుంది.
Read also : ఉన్నట్టుండి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ!.. ఏం కటౌట్ రా బాబు.. వర్కౌట్ అవుతుందా?