
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- తన గెలుపుకు సహకరించి, సర్పంచ్ గా ఎన్నుకున్న మేటిచందాపురం, ఇందూర్తి గ్రామ ప్రజలకు, నూతన సర్పంచ్ పదం రవి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 11 శుక్రవారం జరిగిన, ఎలక్షన్లలో గ్రామ ప్రజలందరూ కలిసి కత్తెర గుర్తుపై ఓటు వేసి, తనను గెలిపించినందుకు, ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఈ ఐదు సంవత్సరాల పదవి కాలంలో, గ్రామ అభివృద్ధిలో భాగస్వామినై, గ్రామ అభివృద్ధి చేయుటకు తన వంతుగా కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు, వెన్నంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, తనను నిండు మనసుతో దీవించి, తోడ్పాటు అందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Read also : ఎన్నో విమర్శలు వస్తున్న వేల.. స్టార్ ప్లేయర్లకు మద్దతుగా నిలిచిన అభిషేక్ శర్మ!
Read also : జగిత్యాల కాంగ్రెస్ వర్గ పోరు.. పంచాయతీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ వర్గానిదే పైచేయి!





