
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆస్ట్రేలియాలో ప్రతి ఏడాది నిర్వహించేటువంటి BBL అలాగే WBBL టోర్నీలలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇకపై బ్యాటర్స్ ఎవరైనా సరే సిక్స్ లేదా ఫోర్లు కొట్టినప్పుడు ఆ బాలు నేరుగా మైదానం దాటి ప్రేక్షకుల్లోకి వెళితే ఆ బంతిని వారే స్వయంగా ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు అని పేర్కొంది. అయితే కేవలం మొదటి ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ కు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయని పేర్కొన్నారు. మొదటి ఓవర్ లో ఎన్నిసార్లు ఫోర్లు కొట్టినా లేదా సిక్స్ లు కొట్టిన ఆ బంతిని నేరుగా ప్రేక్షకులు తీసుకోవచ్చు అని వెల్లడించింది. ఒకవేళ ఆ బంతిని ప్రేక్షకులు ఎవరు తీసుకోకపోయినా కూడా రెండో ఓవర్ నుంచి కొత్త బంతిని వాడునున్నారు.
ఇలా చేయడం పట్ల కాస్త మ్యాచ్ ఆలస్యం జరుగుతుంది కాబట్టి.. ఎంపైర్లు స్వయంగా వారి దగ్గరే కొన్ని అదనపు బంతులను ఉంచుకుంటారు అని తెలిపారు. కాగా ప్రేక్షకులను అలరించడానికి ఇలాంటి కొత్త రూల్స్ తీసుకువస్తున్నామని కూడా తెలిపారు. ఈ కొత్త రూల్స్ పై కొంతమంది ఇవేం చిలిపి రూల్స్ అని వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ రూల్స్ బాగున్నాయి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇలాంటి రూల్స్ ను మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా తీసుకురావాలని ఇండియన్ అభిమానులు కోరుతున్నారు.
Read also : క్యాన్సర్ కారణంగా కేజీఎఫ్ లో కీలక పాత్ర పోషించిన నటుడు మృతి!
Read also : మోదీని ఇంట్రెస్టింగ్ క్యూస్షన్ అడిగిన మహిళా ప్లేయర్?





