
మందమర్రి,క్రైమ్ మిర్రర్:-మందమర్రి,రామకృష్ణపూర్-వయా-మంచిర్యాల మధ్య ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. మందమర్రి ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన షెడ్యూల్ ఆర్టీసీ బస్సును కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన,ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.గ్రామాలు, పట్టణాలను అనుసంధానిస్తూ ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ నూతన బస్ సేవతో మందమర్రి, రామకృష్ణపూర్ ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాల చేరుకోవడం సులభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బస్ ప్రారంభంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
Read also : గాయత్రి బ్యాంకు నుంచి ప్రమాదభీమా చెక్కు పంపిణీ
Read also : విజయ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న రింకూ సింగ్?





