తెలంగాణ

ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం యాదవ్, శంకర్ నాయక్ ప్రమాణం

తెలంగాణలో శాసనమండలికి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు.కొత్త ఎమ్మెల్సీల తో ప్రమాణ స్వీకారం చేయించారు శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇటీవల మొత్తం 8 మంది ఎమ్మెల్సీలుగా కొత్తగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఐదుగురు… టీచర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలుగా ఇద్దరు.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒకరు గెలిచారు. వీరిలో ఇవాళ ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.

ఎమ్మెల్యేల కోటాలో సీపీఐ నుంచి గెలిచిన నెల్లికంటి సత్యం యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి ప్రమాణం చేయగా.. ఎమ్మెల్యేల కోటాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దాసోజు శ్రవణ్ కుమార్ మాత్రం మరోరోజు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో గెలిచిన ఐదుగురు కొత్త ఎమ్మెల్సీల్లో నలుగురు ఉమ్మడి నల్గొండ జిల్లా వారే. దాసోజు శ్రవణ్ ది నకిరేకల్ నియోజకవర్గం కాగా.. అద్దంకి దయాకర్ తుంగతుర్తి నియోజకవర్గం. శంకర్ నాయక్ నాగార్జున సాగర్ సెగ్మెంట్ కు చెందిన వ్యక్తి కాగా.. సీపీఐ నుంచి గెలిచిన నెల్లికంటి సత్యం యాదవ్ మునుగోడు నియోజకవర్గానికి చెందిన నాయకుడు.


Also Read : కల్తీ మద్యం గుట్టు రట్టు…కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.


కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజి రెడ్డితో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీ పాల్ రెడ్డితో కూడా మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, వివిధ పార్టీల నేతలు కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు. సామాన్య రైతుగా ఉంటూ ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యం యాదవ్ కు అభినందనలు తెలిపేందుకు ఆయన మద్దతుదారులు, సీపీఐ నేతలు, కార్యకర్తలు శాసనమండలి దగ్గరకు భారీగా తరలివచ్చారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ని చేస్తానని నెల్లికంటి సత్యం యాదవ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి .. 

  1. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో బిగ్ ఎలర్ట్

  2. రాజాసింగ్ జై శ్రీరామ్ శోభాయాత్ర.. పాతబస్తీలో హై టెన్షన్

  3. తెలంగాణ లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

  4. సన్నబియ్యం పేదవాడి ఆత్మ గౌరవం..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  5. జూలై తర్వాతే సర్పంచ్ ఎన్నికలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button