ఆంధ్ర ప్రదేశ్

కొత్త జిల్లాలపై సరికొత్త డిమాండ్లు.. ఈనెల 15లోపు నివేదిక!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీలో జిల్లాల పునర్‌విభజనపై కసరత్తు కొనసాగుతోంది. కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటోంది. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తోంది. ఈ క్రమంలో… సబ్‌ కమిటీకి ప్రజల నుంచే కాకుండా నాయకుల నుంచి కూడా కొత్త కొత్త డిమాండ్లు వస్తున్నాయట. ఏంటా కొత్త డిమాండ్లు..? గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం… 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలుగా మార్చింది. అప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరిగింది. అయితే.. ఆ ప్రక్రియ సరిగా జరగలేదని… కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటు, మార్పులు-చేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత… ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఉన్న జిల్లాల్లో జరగనున్న మార్పులు ఏంటి…?

Read also : 2027 డిసెంబర్‌కు SLBC పూర్తిచేస్తామన్న సీఎం.. ఇది సాధ్యమేనా?

మార్కాపురం, మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో… ఆ రెండు కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమనే అనుకోవాలి. ఇక… రాజధాని ప్రాంతమైన అమరావతిని ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు చేయాలనే చర్చ జరుగుతోంది. అలాగే… శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న హిందూపురాన్ని కూడా జిల్లాగా చేయాలనే డిమాండ్‌ ఉంది. ఇక.. పోలవరం, గూడూరు, ఆదోని, పలాసలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.కొన్ని జిల్లాలకు పేర్ల మార్పు చేయబోతున్నారని సమాచారం. వైసీపీ హాయంలో కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మారింది. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. దీంతోపాటు.. కొన్ని చోట్ల జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు మార్చాలన్న డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మండల కేంద్రాలను కూడా మార్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను హెడ్‌క్వార్టర్‌గా పెట్టాలని కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లానుకు రాయచోటిని హెడ్‌క్వార్టర్‌గా పెట్టింది. దానిని మార్చి రాజంపేటను మండలకేంద్రంగా చేయాలని కోరుతున్నారు. అలాగే… కృష్ణా జిల్లా నుంచి పెనుమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలోకి మార్చే ఆలోచేన కూడా ఉన్నట్టు సమాచారం. వీటిపై కేబినెట్‌ సబ్‌కమిటీ కసరత్తు చేస్తోంది. డిసెంబర్‌లోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Read also : బర్త్ డే చేస్తామని పిలిచి, యువతిపై గ్యాంగ్ రేప్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button