
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్ట్రేషన్ బ్యూరో:- మోసం.. మోసం.. మోసం.. సైబర్ నేరగాళ్లకు తెలిసింది ఇదొక్కటే. ఎలాగైనా.. అకౌంట్లు ఖాళీ చేయడమే. డబ్బు లూటీ చేయడమే. ఎక్కడో కూర్చుని.. ముందు ఒక కంప్యూట్ పెట్టుకుని… అమాయకులకు గాలం వేస్తారా. ఆ గాలానికి చిక్కామో.. ఇక అంతే సంగతులు. ఖాతా ఖాళీ అయినట్టే. సైబర్ నేరాలపై ప్రజల్లో ఇప్పుడు కాస్తో కూస్తో అవగాహన వచ్చింది. ఎక్కడో ఎవరో తప్ప…. చాలా మంది ఎవరికీ ఓటీపీలు చెప్పడంలేదు.. తెలియని లింక్‌లు క్లిక్ చేయడం లేదు. దీంతో.. సైబర్ నేరగాళ్ల చేతులు ఆడటంలేదు. ఖాతాలు నిండటంలేదు. దీంతో.. కొత్త దారులు వెతుకుంటున్నారు. మాయ చేసి ముంచేసేవారు.. ఇప్పుడు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. పెట్టుబడుల పేరుతో ఆకర్షిస్తున్నారు.. నమ్మితే ఓకే… నమ్మలేదంటే.. నమ్మేలా చేసుకుంటున్నారు. అందుకు వారి డబ్బును ఎరగా వేస్తున్నారు. లక్షల రూపాయలు జమ చేస్తున్నారు. అత్యాశ ఉన్నవారు అకౌంట్‌లో లక్షలాది రూపాయలు వేసురుగా అని వారిని నమ్మేస్తున్నారు. వారి వలలో పడుతున్నారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబో మంటున్నారు. ఇలా.. ఒకరి నుంచి మూడు కోట్లు కాజేశారు కేటుగాళ్లు. ఇంతకీ ఏం జరిగిందంటే…?
ఆ లిల్లీపుట్ నన్నేంత వాడా – జగదీష్‌రెడ్డికి కవిత కౌంటర్ – కేసీఆర్ రియాక్షన్ ఇదే..!
హైదరాబాద్ మణికొండలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గాలం వేశారు సైబర్ నేరగాళ్లు. గత ఏడాది ఏప్రిల్‌లో స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరుతో.. అతని వాట్సాప్‌కు ఒక మెసేజ్ పంపారు. పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని కబుర్లు చెప్పారు. వారి మాటలను అతను కూడా నమ్మాడు. పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చేపించాడు. సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో రెండు కోట్ల రూపాయల వరకు జమ చేశాడు. ఆ తర్వాత అతనికి అనుమానం వచ్చింది. పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలని.. అని డౌట్ పడ్డారు. సైబర్ నేరగాళ్లతో తన అనుమానం చెప్పాడు. అంత డౌట్‌గా ఉంటే… మీ సొమ్మును వెనక్కి తీసుకోవచ్చని చెప్పారు. అది నిజమేనా…? చూద్దాం అనుకుని బాధితుడు… మరో అకౌంటర్ ఇచ్చి.. అందులో డబ్బు రిటర్న్ వేయమన్నాడు. అతనికి అనుమానం వస్తే అసలుకే మోసం వస్తుంది.. అదే నమ్మకం కుదిరిస్తే… అతని నుంచి ఇంకా రాబట్టుకోవచ్చని అనుకున్నట్టు ఉన్నారు. అందుకే…87లక్షల రూపాయలను బాధితుడు చెప్పిన అకౌంటర్ రిటర్న్ చేశారు. డబ్బు తిరిగి ఇవ్వడంతో… వాళ్లపై గురి కుదుర్చుకున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పెట్టుబడులు పెడుతూనే పోయాడు. అలా… 3 కోట్ల 92 లక్షల రూపాయలు పెట్టుబడి కింద పెట్టాడు. మధ్యలో అవసరం వచ్చి… కొంత డబ్బును వెనక్కి తీసుకుందామనుకున్నాడు. కానీ.. అప్పటికే సైబర్ నేరగాళ్లు చాప చుట్టేశారు. తట్టా బుట్టా సర్దేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. చెప్పుకుంటే పరువు కూడా పోతుందని నోరుమూసుకుని ఉన్నాడు.
Read also : కొడాలిని వదలని కూటమి – మరో కేసు – త్వరలోనే అరెస్ట్..?
అయితే… ఇటీవల… సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తల్లి ఖాతాను గుజరాత్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఎందుకు అలా చేశారని ఎంక్వైరీ చేస్తే… సైబర్ నేరగాళ్లు.. ఆ అకౌంట్‌కి 87లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చెప్పాడు. దీంతో… తాను కూడా బాధితుడినే అంటూ బయటకు వచ్చాడు ఆ వ్యక్తి. తనకు జరిగిన మోసాని… తన తల్లి అకౌంట్‌లో 87లక్షలు జమకావడం వెనుక ఉన్న స్టోరీని.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల ముందు ఉంచాడు. ఇదండీ సంగతి… ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండకూడదు. ఎవరు.. ఏంటి అని తెలుసుకోకుండా.. పెట్టుబడులు పెట్టకూడదు. ఇంకా ఎప్పటికి తెలుసుకుంటారో.. ఇలాంటి వారంతా!.