క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెట్టిన కరోనా వైరస్ తిరిగి మళ్లీ భారత్ లోకి అడుగు పెట్టింది. తాజాగా కరోనా వైరస్ లాంటి HMPV వైరస్ అనేది చైనాలో బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతం చైనా మొత్తం కూడా ఈ వైరస్ బారిన పడి చాలా మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు చైనాలో ఈ వైరస్ బారిన పడి చాలా మంది చనిపోయినట్లుగా కూడా మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం ఈ వైరస్ ను ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
హైటెన్షన్.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!!
ప్రస్తుతం చైనాలో వ్యాప్తి చెందుతున్న వైరస్ మన దగ్గరికి ఎందుకు వస్తుంది అని చాలామంది పొరబడుతున్నారు. కానీ ఐదేళ్ల క్రితం వచ్చినటువంటి కరోనా దాదాపుగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక సునామిలా అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణించడం జరిగింది. కాబట్టి ఈ వైరస్ ని కూడా అంత తేలికగా తీసుకోకూడదని కేంద్రం భావిస్తుంది. అందరూ భయపడుతున్నట్లుగానే తాజాగా ఈ వైరస్ మన భారతదేశంలోకి అడుగు పెట్టింది. దీంతో మళ్లీ లాక్ డౌన్ వస్తుందేమో అని ప్రజలందరూ భయపడుతున్నారు.
అలా అయితే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయండి : YCP అధికార ప్రతినిధి
చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అనేది ఇతర దేశాలకు పాకడానికి సమయం పడుతుందని అందరూ భావించారు. కానీ చాలా వేగంగా అవే లక్షణాలతో మన భారతదేశంలోని బెంగళూరులో 8 నెలల చిన్నారి ఆసుపత్రిలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ దెబ్బకి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి అని కేంద్ర ప్రభుత్వం సలహాలు ఇస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించండి అని, ప్రతి గంటకి ఒకసారి చేతులు శుభ్రంగా కడగాలని, బహిరంగ ప్రదేశాలలో షేక్ హాండ్స్ ఇవ్వకండి అని డాక్టర్లు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాక్ డౌన్ ప్రకటిస్తారేమో అని భయపడుతున్నారు. కానీ ఇప్పట్లో లాక్ డౌన్ ప్రకటించే అవకాశం లేదన్నట్లుగా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన తెలంగాణ యువకుడు !.. కానీ ప్రభుత్వం నుండి నో సపోర్ట్?