
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఎంతో ఆనందంతో కొత్త కారు కొనగా… అదే కారు రూపంలో తన తల్లి మృతదేహాన్ని చూస్తాడని అనుకోలేకపోయాడు ఆ కొడుకు. ఆ కుటుంబానికి కొత్త కారు కొన్న ఆనందం కొద్ది గంటల క్షణాలు కూడా నిలవలేదు. ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం లోని చిర్రి కూరపాడుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. అయితే వారం క్రితమే ఎంతో ఇష్టంతో తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఒక కొత్త కారును కొనుక్కున్నాడు. ఆ కారు కొనిన మూడు రోజుల తర్వాత ఒక శుభకార్యంలో పాల్గొనడానికి ఆ కొత్త కారుని తీసుకొని స్వగ్రామానికి వచ్చాడు. ఇక ఆ శుభకార్యానికి హాజరు అయ్యి.. తిరిగి మళ్లీ అదే కారులో సోమవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. కానీ మృత్యువు అనుకోని రూపంలో వచ్చింది. హైదరాబాదుకు వెళుతున్న క్రమంలో చౌటుప్పల్ వద్ద అ కారును ఒక లారీ ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ అలాగే తన భార్య ఇద్దరకి కూడా గాయాలు అవ్వగా అతని తల్లి గోవిందమ్మ మాత్రం మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొత్త కారు కొన్న ఆనంద క్షణాలు… పట్టుమని ఐదు రోజులు కూడా నిలవలేదు. కొత్త కారే మృత్యు రూపంలో వచ్చింది అని కొడుకు ప్రవీణ్ కుమార్ తల్లడిల్లిపోయాడు. ప్రమాదం జరిగిన స్థలంలో తల్లి మృద్దేహాన్ని చూసి కొడుకు ప్రవీణ్ కుమార్ తట్టుకోలేకపోయాడు.
Read also : రాజా సాబ్ సినిమా నుంచి మరో కీలక అప్డేట్.. పార్ట్-2 కూడా ఉంది!
Read also : దేవుడు మీద ఒట్టు!.. నేనే తప్పు చేయలేదండి.. అంటూనే సూసైడ్?