Saturday, March 28, 2026
Homeఅంతర్జాతీయంకాల్పుల విరమణకు ఓకే.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక ప్రకటన!

కాల్పుల విరమణకు ఓకే.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక ప్రకటన!

Benjamin Netanyahu: ఇరాన్‌ తో  కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెల్లడించారు. ఒకవేళ ఇరాన్ ఎలాంటి అతిక్రమణకు దిగినా, తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతామని హెచ్చరించారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత 12 రోజులుగా పరస్పర వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ లో న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడుల చేసింది. ప్రతిగా ఇరాన్ అమెరికా బేస్ లపై ప్రతిదాడులకు దిగింది. ఈ దాడుల తర్వాత ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రతిపాదనను ముందుగా ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ మాత్రం అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. క్యాబినెట్, రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్, మోసాద్ చీఫ్ తో పాటు కీలక నేతలతో ప్రధాని నెతన్యాహూ చర్చించారని ఆదేశ పీఎంవో ప్రకటించింది. ఆపరేషన్ రైజిల్ లయన్ అనుకున్న లక్ష్యాలను అందుకున్నట్లు వెల్లడించింది. న్యూక్లియ‌ర్, బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి పొంచి ఉన్న ప్ర‌మాదం తప్పిందని వెల్లడించింది.

ఐడీఎఫ్ ఆధీనంలో ఇరాన్ గగనతలం

యుద్ధం సందర్భంగా ఇరాన్ గ‌గ‌న‌తలాన్ని పూర్తిగా ఐడీఎఫ్ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌ లో కీల‌క స్థావరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ సైనిక నేత‌ల‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలిపింది. అటు తమకు మద్ధతు ఇవ్వడంతో పాటు అణు భయాన్ని తొలగించిన అమెరికాకు ధన్యవాదాలు చెప్పింది. ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ లక్ష్యం నెరవేరిన కారణంగా, ప్రెసిడెంట్ ట్రంప్ కోరిక మేరకు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.  అయితే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్ మీద ప్రతి చర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్

ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తొలుత అమెరికా ప్రకటించింది. ఫస్ట్ ఇరాన్ కాల్పుల విరమణ పాటిస్తుందని, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఆపుతుందని ఆయన తెలిపారు. యుద్ధానికి ముగింపు లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రకటన తర్వాత కూడా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ మొదలుపెట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఓకే చెప్పింది.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది, ట్రంప్ కీలక ప్రకటన!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments