Uncategorizedఆంధ్ర ప్రదేశ్

హీటెక్కిస్తున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు… కోవూరులో నల్లపురెడ్డి వర్సెస్‌ వేమిరెడ్డి

  • ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్‌

  • ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • మహిళ ఫిర్యాదుతో నాలుగు సెక్షన్ల కింద కేసులు

 

క్రైమ్‌ మిర్రర్‌, అమరావతి: నెల్లూరు జిల్లాలో తాజా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వర్సెస్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగా పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల నుంచి ఈ వైరం ముదిరి ఇప్పుడు పాకానికి చేరింది. తాజాగా ప్రశాంతిరెడ్డి పనితీరుపై, ఆమె వ్యక్తిగత జీవితంపై సన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఇరువురి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య రాజకీయం వేడెక్కింది. ఈ తరుణంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను, అద్దాలను, కార్లను ధ్వంసం చేశారు. ఇది ప్రశాంతిరెడ్డి వర్గీయుల పనేనని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రతిగా ఈ దాడిలో తమ ప్రమేయమేమీ లేదని ప్రశాంతిరెడ్డి వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రసన్నకుమార్‌రెడ్డిపై బీఎన్‌ఎస్‌ 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డికి త్వరలోనే పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రసన్నకుమార్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే, కోవూరులో నల్లపురెడ్డి, వేమిరెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పోటీ ఉంది. నల్లపురెడ్డి కుటుంబం వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ బలమైన పట్టు సాధించింది. కాగా గత ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి గెలిచారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి ఇరుకుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button