
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎంతోమందికి ఉంటుంది.. కానీ వాటికి ఏ ఫ్లాట్ ఫామ్ ఎంచుకోవాలని ఇప్పటికి కూడా చాలామంది ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన చిన్నతనం నుంచి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో రాజకీయాలే ప్రజలకు సహాయం చేయడానికి ముఖ్య మార్గమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన 17 ఏళ్లలోనే ఏకంగా ముఖ్యమంత్రిగా ఎదిగారు అనముల రేవంత్ రెడ్డి. అయితే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి 2007 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి 2009 మరియు 2014లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ తర్వాత 2017వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక కాంగ్రెస్ లో ఎప్పుడైతే చేరాడో రేవంత్ రెడ్డికి వరుసగా ఆఫర్లు అయితే చాలానే వచ్చాయి. 2021 వ సంవత్సరంలో టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని హస్తం పార్టీ నిలబెట్టింది. ఇక ఆ తరువాత నుంచి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఫుల్ జోష్ ను నింపారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటికి రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టి దాదాపు పది సంవత్సరాలు పాటు అధికారంలో ఉంది. అలాంటి సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. ప్రతి చోటా తిరుగుతూ.. బీఆర్ఎస్ పాలనను తిప్పి కొట్టారు. ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి భారీగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక 2023 ఎలక్షన్ సమయం వచ్చేసరికి ఒక పోరాట యోధుడిలా ప్రజలకు రేవంత్ రెడ్డి కనిపించారు. దీంతో 2023 ఎన్నికలలో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు రేవంత్ రెడ్డి. అయితే ఈ ముఖ్యమంత్రి పదవి కోసం కొంతమంది లైన్ లో ఉన్నా కూడా చివరికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిలబెట్టింది హస్తం పార్టీ.
Read also : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… బీఆర్ఎస్ నేతల ఇంటిపై సోదాలు… రాజకీయ హీట్
Read also : అత్తమామల నగల కోసం కోడలి పన్నాగం..!





