
క్రైమ్ మిర్రర్, తెలంగాణ‘- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న వినాయక చవితి పండుగ రోజున కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. నిన్న కురిసినటువంటి అత్యంత భారీ వర్షాలకు నేషనల్ హైవే-44 తీవ్రంగా దెబ్బ తిన్నది. భారీ వర్షాలకు రోడ్లపై పెద్ద గుంతలు పడటం తో పాటు పలుచోట్ల భారీగా వరద నీరు చేరిపోయింది. అలాగే ఈ హైవేపై మధ్య మధ్యలో రహదారి కోతకు గురైంది. దీంతో నిర్మల్- కామారెడ్డి- హైదరాబాద్ కు రాకపోకలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎవరైతే హైదరాబాద్ వైపు ప్రయాణం చేయాల్సి ఉంటుందో.. వారు వారి యొక్క వాహనాలను కొండాపూర్ మీదుగా జగిత్యాల అలాగే కరీంనగర్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా నిర్మల్కు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఎస్పీ జానకి ప్రజలకు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, నదులు, లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాకుండా రోడ్లు కూడా కోతకు గురవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అల్పపీడనం కారణంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
Read also : ఉత్తరాదిలో ఆకస్మిక వరదలు..స్తంభించిన జనజీవనం!
Read also : కృష్ణానదికి పెరిగిన వరద, శ్రీశైలం, సాగర్ గేట్లు ఓపెన్!