భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న చెట్టు ఎర్రచందనం. ఎర్రచందనం చెట్టు గురించి ప్రతి ఒక్కరూ దాదాపుగా వినే ఉంటారు. తాజాగా ఈ ఎర్రచందనం గురించి అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమాలో వినే ఉంటారు. అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి అల్లు అర్జున్ ఏ స్థాయికి ఎదుగుతాడు కూడా మనందరం గమనించే ఉంటాం. నిజానికి ఎర్రచందనం చెట్టు నరకడం అనేది చట్టపరంగా విరుద్ధం. ఈ ఎర్రచందనం చెట్లు నరికి ఆక్రమంగా తరలిస్తున్న వారు ఇప్పటికే చాలా మంది జైలు జీవితం అనుభవిస్తున్నారు. అసలు ఎర్రచందనం చెట్లకు ఎందుకు అంత డిమాండ్ పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read More : టాలీవుడ్ ట్రెండింగ్ లో సీక్వెల్ సినిమాలు!.. ఎందుకో తెలుసా?
ఎర్రచందనం అనేది మన భారతదేశంలోని చాలా ఖరీదైన మరియు అరుదైన చెట్లు. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే పెరుగుతుంది. అదికూడా దట్టమైన అడవుల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇక ఈ చెట్లకు ఎందుకు అంత డిమాండ్ ఉందంటే ఈ చెట్లతో చాలా రకాలు వస్తువులు తయారుచేయబడతాయి. ఉదాహరణకి మనం వాడేటువంటి ఫర్నిచర్స్, విగ్రహాలు తయారీ, అలంకరణ వస్తువులు, ఫర్ఫ్యుమ్స్ వంటివి చాలానే ఈ చెట్ల ద్వారా తయారు చేస్తున్నారు. వీటితో తయారు చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా సంవత్సరాలు పాటు ఉంటాయి. కాబట్టి వీటికి ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది.
Read More : తండ్రి vs కొడుకు మధ్య గొడవలు!.. నిజమెంత?
ఇకపోతే ఎర్రచందనం సగటు ధర కిలో 50వేల నుండి దాదాపు లక్ష వరకు పలుకుతుంది. అదే కొంచెం నాణ్యమైన ఎర్రచందనం అయితే ఏకంగా రెండు లక్షల వరకు ఉంటుంది. కాబట్టి దీనికి చాలానే డిమాండ్ ఉంది. కాబట్టి ఎక్కువగా అక్రమంగా దట్టమైన అడవుల్లోకి వెళ్లి మరి కొంతమంది నరికి మరి అక్రమంగా అమ్ముకుంటున్నారు. కేజీ ఎర్రచందనం ఏకంగా 50,000 పైగా ఉండడం ద్వారా సులువుగా వాటిని అక్రమంగా నరికి మరి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే మనం బయట చాలా మంది జైలు జీవితం కూడా వీటి ద్వార అనుభవిస్తున్నారు. ఇక భారతదేశం 1960 వరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్రచందనం ఉత్పత్తి చేసే దేశంగా గుర్తింపు పొందింది. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఆస్ట్రేలియా దేశం అత్యధికంగా ఈ ఎర్రచందనం ఉత్పత్తి చేస్తుంది.