జాతీయం

ఇందిరా గాంధీని దాటి రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు. వరుసగా అత్యధిక రోజులు భారత ప్రధానిగా పనిచేసినటువంటి రెండవ వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఆ ఘనతను సాధించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటికీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 4078 రోజులు పూర్తి అయ్యాయి. అయితే గతంలో ఇందిరాగాంధీ 4077 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. దీంతో కేవలం ఒకరోజు ముందుకు దాటి ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాగా ఇందిరా గాంధీ 1966వ సంవత్సరంలో జనవరి 24వ తేదీన మొదటిగా ప్రధానమంత్రి అయ్యారు. ఆ తరువాత 1977 మార్చి 24 వరకు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. మరోవైపు నరేంద్ర మోడీ 2014 మే 26వ తేదీన భారత ప్రధానిగా ఎన్నికయ్యారు.
మొరాయించిన మూసీ గేట్లు.. ఒకదానికి పూజ.. మరొకటి ఓపెన్!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కాబట్టి నేటికీ కూడా ఆయన ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ నేటికీ ప్రధానమంత్రిగా 4078 రోజులను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ లిస్టులో మొదటి స్థానంలో… అనగా అత్యధిక రోజులు ఈ ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా నెహ్రూ రికార్డ్ అనేది సృష్టించి పెట్టారు. నెహ్రూ వరుసగా 16 సంవత్సరాలయి 286 రోజులు భారత ప్రధాన మంత్రిగా ఎన్నో సేవలను అందించారు. కాగా ప్రస్తుతం భారతదేశం ఇలా ఉందంటే ఈ ప్రధానమంత్రుల పాత్ర చాలానే ఉంది. ఇందులో మరీ ముఖ్యంగా ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. నేడు భారతదేశ ఎదుగుదలలో నరేంద్ర మోడీ పాత్ర చాలా ఉంది. వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా నేడు భారతదేశ వైపు చూస్తున్నాయి అంటే దానికి కారణం మోడీ.
UAE దేశంలో స్పెషల్ ఇదే!.. అన్నీ ఉచితమే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button