Monday, February 23, 2026
Homeతెలంగాణగోవర్ధనగిరిధారిగా నారసింహుడు

గోవర్ధనగిరిధారిగా నారసింహుడు

  • వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
  • వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భక్తులు

యాదగిరిగుట్ట, క్రైమ్ మిర్ర‌ర్: యాదగిరిగుట్ట శ్రీలకీëనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని ‘గోవర్ధనగిరిధారి’ అలంకరణలో భక్తులు సేవించారు.

భక్తజన రక్షణె ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింభించే అలంకరణలో దివ్య మనోహరంగా భక్తజనులకు దర్శనమిచ్చారు. తన చిటికెన వేలుతో గోవర్థన పర్వతాన్ని ఎత్తిపట్టి గోపాలులను రక్షించిన మహిమలను అర్చకులు అలంకార విశిష్టతను భక్తులకు వివరించారు.భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వైభవంగా ఊరేగించారు.

ఉత్సవాలను ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్‌ సురేంద్రాచార్యులు, అర్చక బృందం, వేదపడింతులు, రుత్వికులు శాశ్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు సింహా వాహనం పై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, ఈవో భవాని శంకర్‌, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఉద్యోగ, సిబ్బంది, భక్తులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments