![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/01/Nallamatti-780x470.jpg?lossy=1&strip=1&webp=1)
- రాత్రి సమయాల్లో సైతం ఆగని టిప్పర్ల మోత… అతివేగం, ఓవర్ లోడ్ లకు దద్ధరిల్లుతున్న రోడ్లు..!?
- నిబంధనల ప్రకారం పనులు నడుస్తున్నాయా.. అధికారుల పర్యవేక్షణ శూన్యమేనా..!?
- గతంలో దగ్గరుండి పనులు చేయించిన అధికారులు.. నేడు వారి అలక వెనుక ఆంతర్యమేమిటి..!?
- వందల సంఖ్యలో జిల్లా దాటుతున్న నల్ల వనరు.. 24 గంటలు మోత మోగుతున్న దందా..!?
- స్థానిక ఎమ్మెల్యే నా వెంటే ఉన్నాడని ప్రచారం.. అనుమతి లొకేషన్ లో పనులు చెయ్యటం లేదని అనేక ఆరోపణలు…!?
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): తక్కువ సమయంలో ఎక్కువ ఆధాయం వచ్చే బిసినెస్ ఏదైనా ఉందంటే నల్లమట్టి మాఫియా అనే చెప్పుకోవాలి. గోరంత అనుమతితో కొండంత తవ్వకాలు చేసి, లక్షల సొమ్మును మూటగట్టుకుంటారు వ్యాపారులు.. ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఈ సహజ వనరు ఇటుక బట్టీల నడుమ కాసుల వర్షం కురిపిస్తుంది. రైతన్నకు ఆసరాగా నిలుస్తూ, భూమిలో సారవంతాన్ని పెంచుతూ, పంటకు తోడ్పడే ఈ చెరువు నల్లమట్టి దళారుల చేతిలో దగా పడిపోతుంది.. ఇది ఇలా ఉండగా జిల్లాలోని నాంపల్లి మండలం పరిధిలోని, దామెర గ్రామ చెరువులో నల్లమట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు, అనుమతిలో పొందుపరిచిన విధంగా నియమాలను పాటించటం లేదని, అధికారులు పర్యవేక్షణ చెయ్యటం లేదంటున్నారు మండల ప్రజలు..!?
అనుమతిలో పొందుపరిచిన విధంగా కాకుండా, ఇష్టం వచ్చినట్లు లోతుగా నల్లమట్టిని తోడేస్తున్నారని సమాచారం..!? అతి వేగం, ఓవర్ లోడ్ లతో మర్రిగూడ మండలం రోడ్లు దద్దరిల్లుతున్నాయని, రాత్రి సమయాలలో కూడా టిప్పర్ల ద్వారా జోరుగా జిల్లా దాటి, మరో జిల్లాకు నల్ల వనరు చేరుతుందని, వే బిల్స్ కూడా లేకుండానే పనులు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి..!? ఈ నల్లమట్టి దందా ద్వారా వ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారని, కానీ కనీసం రోడ్లపై నీటిని కూడా చల్లటం లేదంటున్నారు మర్రిగూడ మండల ప్రజలు..!? మునుగోడు నియోజకవర్గంలోనే కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం ప్రోజెక్టుల పనులు జరుగుతున్న నేపథ్యంలో, నల్లమట్టి ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ నిర్మాణాలకు ఉపయోగపడుతుందని, తద్వారా స్థానికంగా నల్లమట్టి దొరికే చెరువులలో, ఇతరులకు మట్టిని తవ్వే అనుమతి ఇవ్వకూడదని, అదే కారణం చేత ఇంతకు ముందు కూడా అనుమతులు ఇవ్వలేదని, మరి అధికారులు ఇప్పుడు అనుమతులు ఇవ్వడానికి గల కారణాలేంటనే అంశంపై చర్చ కొనసాగుతుంది..!?
స్థానిక ఎమ్మెల్యే తన వెంట ఉన్నాడని, నన్నెవ్వరూ ఏమి చెయ్యలేరని, ఆ వ్యాపారి ప్రచారం చేసుకుంటున్నట్లు అనేక ఆరోపణలు వినపడుతున్నాయి..!? అనుమతులు వచ్చిన లొకేషన్ కాకుండా, వేరే లొకేషన్ లో పనులు చేస్తున్నట్లు సమాచారం..!? గతంలో దగ్గరుండి పనులు పర్యవేక్షించిన అధికారులు, ఇప్పుడు అటు వైపే కన్నెత్తి చూడటం లేదంటే అసలు మతలబు ఏంటని ప్రజలు గుసగుసలాడుతున్నారు..!? రోజుకు కనీసం 100 టిప్పర్ ల నల్లమట్టి తరలివెళ్తుందని, అసలు ఈ వ్యాపారులు అనుమతి తీసుకున్నది ఎంత..? తవ్వేది ఎంత అనే అంశాలపై అనేక అనుమానాలు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి..!?
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..
మరింత సమాచారంతో మరో క్రైమ్ మిర్రర్ కధనం ద్వారా మీ ముందుకు..!?