
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన బాలికపై ఇంటి సమీపాన గల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది సంవత్సరాల వయసున్న బాలిక హాస్టల్లో ఉంటూ 5వ తరగతి చదువుతోంది, గత నెలలో ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి సమీపంలో నివసిస్తున్న యువకుడు డానియేల్ బాలికలకు మాయమాటలు చెప్పి అత్యా చారం చేసి ఎవరికైనా చెప్తే బాగోదని భయభ్రాంతులకు గురిచేశాడు.
తిరిగి పాఠశాలకు వెళ్లగా పాఠశాల ఉపాధ్యాయురాలు బాలికకు తీవ్ర కడుపునొప్పి ఉందని తల్లికి సమాచారం అందించడంతో హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి బాలికను తల్లి అడగగా శనివారం విషయం తెలిపింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి బాలికను జిల్లా కేంద్రంలోని సఖి సెంటరు పంపించినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.