
క్రైమ్ మిర్రర్, ములుగు:-జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి సమావేశంలో జిల్లా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో ములుగు జిల్లా కమిటీ అధ్యక్షులుగా వడ్డేపల్లి నగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిసి రాజ్యాధికార సమితి వ్యస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ నియామక పత్రాన్ని అందించారు. అనంతరం బీసీ రాజ్యాధికార వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ మాట్లాడుతూ.. బిసిలు ఆర్ధికంగా, సామాజికంగా రాజకీయంగా, రాజకీయాలలో దూరంగా ఉండటం చూసి, మన బిసిలం ఎందుకు రాజకీయాల్లో రణించలేం అనే భావనతో బిసి రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేశామని, దీనిని ప్రతి గ్రామం, మండలం, జిల్లాల్లో కమిటీ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, అందులో భాగంగానే ములుగు జిల్లాలో బిసి రాజ్యాధికార సమితి కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ.. తనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతలను ఎల్లవేళలా నిర్వర్తిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యహరకర్తగా డా.పల్నాటి నరేష్ పూర్తి బాధ్యతలతో ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి బిసి రాజ్యాధికార అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.