తెలంగాణ

సాగర్ కు పోటెత్తిన పర్యాటకులు, జనసంద్రంగా డ్యామ్ పరిసరాలు!

Nagarjuna Sagar Tourists:  నాగార్జునసాగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు  26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి పోటెత్తుతున్నారు. సాగర్‌ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. కృష్ణమ్మ పరవళ్ళను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

జనసంద్రంగా సాగర్ పరిసరాలు  

హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో నాగార్జున సాగర్ కు తరలివచ్చారు. దీంతో నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ నియంత్రించేంతగాను పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్ కావడంతో  జనాల తాకిడి విపరీతంగా ఉండడంతో ప్రధాన డ్యాం, పవర్ హౌస్ పరిసరాలకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ చూస్తూ పర్యాటకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం,  ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్ ను సందర్శించి ఎంజాయ్ చేస్తున్నారు.

సాగర్ కు పోటెత్తుతున్న వరద

అటు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్  కు భారీ వరదల పోటెత్తుతోంది. అధికారులు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 24 గేట్లు 5 ఫీట్లు, 2గేట్లు 6 ఫీట్ల మేర పైకి ఎత్తి 2,10,010 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,47,161 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,57,178 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 585.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 297.72 టీఎంసీలుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కరెంటు తయారీ కొనసాగుతోంది.

Read Also: శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద, సాగర్ లోకి కృష్ణమ్మ పరుగులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button