వైరల్సినిమా

నా పెళ్లికి చాలా సమయం ఉంది.. రూమర్స్ నమ్మకండి : మీనాక్షి చౌదరి

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇందులో కొన్ని నిజమైన వార్తలు ఉండగా మరికొన్ని ఫేక్ వార్తలు ఉంటున్నాయి. నిజమైన వార్తలు కంటే ఫేక్ వార్తలకు ఈరోజుల్లో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఎక్కడికి వెళ్లినా కూడా ఏదో ఒక ఫేక్ వార్తను సృష్టించి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని చూసిన ఆయా ప్రముఖులు అందరూ ఇవి ఫేక్ వార్తలని చెప్పడం ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి పెళ్లి గురించి వార్తలు రాగా వాటిపై స్పందిస్తూ ఆమె కొన్ని కీలక విషయాలను తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి నా పెళ్లి వార్తలను ఎవరు నమ్మవద్దు అని ఆమె స్పష్టం చేశారు.

Read also : ఐపీఎల్ పై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం..?

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె పెళ్లిపై వచ్చేటువంటి వార్తలను తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఈ పెళ్లి రూమర్స్ విన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది అని.. ఇలాంటివి ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని ఆమె నవ్వుకుంటూనే ప్రశ్నించారు. తప్పకుండా నాకు వివాహం ఫిక్స్ అవుతే నేనే అనౌన్స్ చేస్తాను అని.. అయినా దానికి చాలా సమయం ఉంది లే అంటూ చెప్పుకోచ్చారు. ఇక చివరిలో లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని ఆమె చెప్పడంతో.. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టితో కలిసి “అనగనగా ఒక రాజు” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీన ఘనంగా విడుదల కాబోతుంది. అయితే చాలా రోజుల క్రితం నుంచి టాలీవుడ్ హీరో సుశాంత్ తో మీనాక్షి చౌదరి ప్రేమ్ లో ఉన్నట్లుగా ఇప్పటికే ఎన్నోసార్లు రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు అని.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని మీనాక్షి చౌదరి కొన్ని సందర్భాలలో ప్రకటించారు. ఇక సుశాంత్ హీరోగా నటించిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే మూవీ తోనే మీనాక్షి చౌదరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Read also : కొడుకు కోసం ఆరాటం.. 11వ కాన్పులో పుట్టిన మగబిడ్డ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button