
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నేడు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై ఇప్పటికే వైసీపీ పార్టీ అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. తాజాగా జోగి రమేష్ కొడుకు అయినటువంటి జోగి రాజీవ్ తన తండ్రి అరెస్టు గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు అలాగని నేరం రుజువు అయినట్లు కాదని వెల్లడించారు. కక్ష సాధింపులలో భాగంగానే ఇలా మా నాన్నని అక్రమంగా అరెస్టు చేశారు అని ఆరోపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును వెంటనే CBI కి అప్పగించాలి అని డిమాండ్ కూడా చేశారు. ఇదంతా కూడా కల్తీ నాయకులతో తయారుచేసిన కల్తీ కేసు అని జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నన్ను.. ఇప్పుడు మా నాన్న ను కావాలనే అక్రమ కేసులు కింద అరెస్ట్ చేస్తున్నారు అని మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అవ్వగా.. కొద్దిరోజుల ముందే నేను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు.
Read also : భారత్ సూపర్ విక్టరీ.. అప్పుడే అయిపోలేదు?
Read also : పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయం.. ఇదే హైడ్రా తీరు : కేటీఆర్





