
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- గత రెండు మూడు రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు పై ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై గరికపాటి నరసింహారావు పరోక్షంగా స్పందించారు. ఒక నేరస్తుడికి శిక్ష కంటే సమాజం అసహ్యించుకున్నప్పుడే మార్పు అనేది వస్తుంది అని యూట్యూబర్ అన్వేష్ ను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఏ మచ్చ లేని వారిపై కూడా ఇలా బురద జల్లడం మంచిది కాదు.. వీటన్నిటిని నా అభిమానులు ఎవరూ కూడా సహించరు అని స్పష్టం చేశారు. ఎవరి పాపాన వారి పోతారు అంటూనే.. ఇటువంటి సమయంలోనే ధర్మానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా నిలిచారు అని వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
Read also : North Korea: కిమ్ కుమార్తె చేతికి.. నార్త్ కొరియా అధికార పగ్గాలు!
దేశంలో ఎక్కడైనా సరే అసభ్యత పై సమాజం గలమెత్తాలి అని గరికపాటి నరసింహారావు పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్ళ పై అలాగే గరికపాటి నరసింహారావు పై గత రెండు మూడు రోజుల క్రితం ప్రపంచయాత్రికుడు నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. అన్వేష్ ను వెంటనే ఇండియాకు రప్పించి అతనికి జైలు శిక్ష విధించాలి అని అలాగే దేశద్రోహిగా ప్రకటించాలి అని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అన్వేష్ పై వివిధ ప్రముఖులు అలాగే హిందూ సంఘాల నాయకులు ఆయా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు సైతం అతనిని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Read also : Crime News: ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రైవేట్ పార్ట్ కట్ చేసి..





