
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రజలకే లాభం అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు.’ ఎంతో కష్టపడి నిద్రాహారాలు మానిమరి భువనగిరి ఎంపీ సీటును గెలిపించాను అని చెప్పకొచ్చారు. 2018లో నేను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే బిజెపికి కనీస డిపాజిట్లు రాలేదని అన్నారు. ఆ తర్వాత మళ్లీ బిజెపి నుంచి బరిలో ఉండి పోటీ చేస్తే కాంగ్రెస్ కు కనీస డిపాజిట్లు రాలేదని మరోసారి తెలియజేశారు. ఇక ప్రస్తుతం 2023 లోను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బిజెపికి డిపాజిట్ దక్కలేదని… తెలియజేశారు.
నేడే వైజాగ్ IPL టికెట్లు విడుదల… ఈ సమ్మర్ తెలుగు యువతకు పండగే?
కాబట్టి ఏ పార్టీ నుంచి చేసిన నావల్ల రాష్ట్రానికి అలాగే నియోజకవర్గంలోని ప్రజలకు మంచే జరుగుతుందని వివరించారు. కాబట్టి ఈ ప్రజలకు ఎప్పుడు సేవ చేసే అందుబాటు కావాలి అంటే మంత్రి పదవి ఉండాలని అన్నారు. కాబట్టి ఈ మంత్రి పదవి నాకు వస్తే కచ్చితంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ లాభమే అని తెలిపారు. కాగా ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మళ్లీ బిజెపికి పోటీ చేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టి కాంగ్రెస్లోనూ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి , ప్రజల నుంచి మంచి గుర్తింపును పొందారు. నిత్యం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
గ్రూప్-2 ర్యాంకర్ కు పోలీసుల సన్మానం..