
చండూరు, క్రైమ్ మిర్రర్:-మున్సిపాలిటీలకు సంబంధించి జనవరి 1న ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటించాల్సి ఉంది. వార్డుల వారిగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో రాష్ట్రంలోనే అన్ని మున్సిపాలిటీల్లో అధికారులు నిమగ్నమయ్యారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా ముసాయిదా ఓటర్ జాబితాను బుధవారం నాటికే సిద్ధం చేసిన చండూరు మున్సిపాలిటీ కమిషనర్ మల్లేశం అండ్ అధికారులు, బి ఎల్ వోలు రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నట్లుగా సమాచారం. అసెంబ్లీ ఓటర్ జాబితాను పోలింగ్ బూతుల వారి నుంచి వార్డుల వారిగా విభజిస్తూ ముసాయిదా ఓటర్ జాబితాన్ని సిద్ధం చేశారు. జనవరి 1న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల ఉంటుంది… 4వ తేదీ వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. 10న తుది జాబితా విడుదల ఉంటుంది.
Read also : పేలిపోతున్న మొబైల్ ఫోన్లు.. కారణాలు ఇవే?
Read also : పేలిపోతున్న మొబైల్ ఫోన్లు.. కారణాలు ఇవే?





