
Pilot Rape Air Hostess: ఎయిర్ హోస్టెస్ పై పైలెట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీ లో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని పోలీసుల అధికారులు వెల్లడించారు.
ఇంటికి పిలిచి అత్యాచారం చేసిన పైలెట్
సదరు పైలట్, 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పని చేస్తున్నారు. థానే లోని మీరా రోడ్ లో వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. తాజాగా ఇద్దరూ ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానంలో డ్యూటీ చేశారు. అనంతరం ముంబైకి వచ్చిన తర్వాత పైలట్, ఎయిర్ హోస్టెస్ కలిసి మీరా రోడ్డులోని తమ ఇళ్లకు ఒకే వాహనంలో చేరారు. ఈ సందర్భంగా పైలెట్ ఆమెను ఇంటికి ఆమెను రమ్మని పిలిచాడు. ఆ సమయంలో అతడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం చేశాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎయిర్ హోస్టెస్
పైలెట్ ఇంటి నుంచి తప్పించుకున్న ఎయిర్ హోస్టెస్.. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. జరిగిన విషయం పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పైలెట్ పారిపోయాడు.పరారీలో ఉన్న పైలట్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అతడి మీద రేప్ సహా పలు కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.
Read Also: భార్యను వదిలేసి వెళ్లిన కేంద్రమంత్రి, మరీ అలా మర్చిపోతే ఎలా సర్?