
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ప్రపంచ ప్రముఖ సోషల్ మీడియా అయినటువంటి యూట్యూబ్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో ఎవరి దగ్గర ఫోన్ ఉన్నా కూడా ఈ యాప్ మాత్రం ఉండాల్సిందే. అలాంటి యూట్యూబ్ యాప్ లో అత్యధిక సబ్స్క్రైబర్లు గల వ్యక్తి ఎవరంటే… అతనే మిస్టర్ బీస్ట్. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ యాప్ లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ గా సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అతను యూట్యూబ్లో 400 మిలియన్ల సబ్స్క్రైబర్లను క్రాస్ చేసి ఏకైక యూట్యూబర్ గా నిలిచి చరిత్ర సృష్టించారు. 400 మిలియన్లు అంటే దాదాపు 40 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారన్నమాట. తాజాగా 40 కోట్ల మంది సబ్స్క్రైబర్లను క్రాస్ చేసిన సందర్భంగా అతను కష్టం మేడ్ యూట్యూబ్ ప్లే బటన్ ను అందుకున్నారు.
ఈ youtube ప్లే బటన్ ఆషామాషీ కాదు. ఇది ఒక పాలిష్ చేసిన లోహంతో తయారుచేసిన బటన్ కావడంతో ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా… అలాంటి ప్రత్యేకమైన youtube ప్లే బటన్ మిస్టర్ బీస్ట్ అందుకున్నారు. కాగా బీస్ట్ తర్వాత రెండవ ప్లేస్ లో ఉన్నది ఇండియాకు చెందిన T-Series యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ కు దాదాపు 299 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 29.9 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంతో మిస్టర్ బీస్ట్ ను ఎవరు కూడా బీట్ చేయలేరని అర్థమవుతుంది. ఒకవేళ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ ను బీట్ చేయాలంటే… అది రెండో ప్లేస్ లో ఉన్న T-సిరీస్ కే సాధ్యం.