
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీఆర్ఎస్ నేత హరీష్ రావు పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. హరీష్ రావు గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పుపై అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది కదా… ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు అని అన్నారు. పదేళ్ల కాలంలో మీ పార్టీ.. మీ నాయకులే నిరుద్యోగులతో ఆడుకున్నారు అని అన్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారా లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించాలి కానీ.. ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయం మాట్లాడుతున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. కోర్టు ఇచ్చిన తీర్పు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Read also : నృత్య ప్రదర్శనల్లో ఐటీ సిబ్బంది.. ఆటపాటలతో ఆకట్టుకున్న ఉద్యోగులు
కాగా హరీష్ రావు.. హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు అని అన్నారు. అంతేకాకుండా నిరుద్యోగుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటమాడుతూ ఉన్నారని హరీష్ రావు ఫైరయ్యారు. పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు అని ఎద్దేవా చేశారు. పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగాలు ఇవ్వడం అంటే చిల్లర రాజకీయాలు చేసినంత సులభం కాదు అని.. ఇప్పటికైనా తమ తప్పులను తెలుసుకొని వెంటనే ముఖ్యమంత్రి స్పందించి నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి.
Read also : ఏపీ లిక్కర్ కేసు ముగిసినట్టేనా..!