
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో భర్తను కోల్పోయిన ఒక మహిళా బయట ప్రపంచం ప్రమాదం అనే భయంతో తన కూతురిని 2 ఏళ్ల పాటు ఇంట్లోనే బంధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చూసి స్థానికులు తట్టుకోలేక వెంటనే కౌన్సిలింగ్ అధికారులకు సమాచారం అందజేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి చెందినటువంటి ఒక బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. రజస్వల అయిన తర్వాత బయట ప్రపంచం ప్రమాదం అనే భయంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు తల్లి భాగ్యలక్ష్మి తన బిడ్డను ఇంటికే పరిమితం చేసింది. భర్త మరణంతో ఒంటరిగా మారినటువంటి తల్లి తన భయాలను పూర్తిగా తన కుమార్తె పై రుద్దింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తోటి గ్రామస్తులు అందరూ కలిసి కౌన్సిలింగ్ అధికారులకు కాల్ చేయగా వారు వెంటనే జోక్యం చేసుకొని తల్లి కుమార్తెలకు సమాజం ఎలా ఉంటుంది… మీరు ఎలా బతకాలి అని పూర్తిగా కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ తల్లిని KGH ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తన కుమార్తె మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించి మరింత కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తన భయాలను పిల్లలపై రుద్దడం మంచిది కాదని కొంతమంది మండిపడుతుంటే మరికొందరు మాత్రం ప్రస్తుతం సమాజమంతా కూడా ఇలానే ఉంది అని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ ఘటనలో ఎవరిది తప్పు అని మీరు అభిప్రాయపడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : కెరీర్ ఫస్ట్.. లేదు పెళ్లి ఫస్ట్.. ఉపాసన & శ్రీధర్ వ్యాఖ్యలు వైరల్!.. ఎవరిని సమర్థిస్తారు?
Read also : BJP Protest: ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ.. రైతులను కాంగ్రెస్ ముంచుతుందన్న బీజేపీ!





