
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలవేళ మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం మీకు తెలిసిందే. ఇక తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నే గణ విజయం సాధించింది. ఈ మధ్యనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాగా ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా గ్రామాల్లో పూర్తిస్థాయిలో ప్రచారాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలోనే మహబూబాబాద్ జిల్లా, దంతపల్లి మండలం, దాట్ల గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించింది. దీంతో ఎంపీటీసీ మాజీ సభ్యుడు తల్లి రాములమ్మను పోటీ చేయమని ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆమె కాళ్ళ మీద పడి మరీ బ్రతిమిలాడాడు. నువ్వు పోటీ చెయ్… నీ కాళ్లు మొక్కుతా అంటూ కాళ్లు పట్టుకొని చాలాసేపు వరకు వదలలేదు. దీంతో ఆమె వెంటనే కాసేపు ఆలోచించుకొని నా నిర్ణయం చెబుతాను అనడంతో వెంటనే అతను శాంతించి పైకి లేచాడు. దీంతో ఈ ఆసక్తికర ఘటన చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఎలా కొనసాగుతుందో అర్థమయ్యే ఉంటుంది.
Read also : Rape Attempt Video: నడిరోడ్డు మీద, అందరూ చూస్తుండగా.. మహిళపై అత్యాచారయత్నం, నెట్టింట వీడియో వైరల్!
Read also : దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో మూడు జిల్లాల స్కూళ్లకు సెలవులు!





