
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినటువంటి ఉపాసన ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులకు ఏదో ఒక రూపంలో జోష్ నింపుతూ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తూనే అపోలో హాస్పటల్ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంట్లోనే ఉంటూ తన కూతుర్ని చూసుకుంటూ రెస్టు తీసుకుంటూ ఉంది. ఇక త్వరలోనే ఈమె కవలలకు జన్మనివ్వబోతుంది కాబట్టి.. చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది.
Read also : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పి శరత్ చంద్ర పవార్
ఇది ఇలా ఉండగా తాజాగా ఉపాసన మరో అరుదైన ఘనతను సాధించింది. “మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్” అనే అవార్డును దక్కించుకున్నట్లు ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కానీ ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల ఆ అవార్డు తీసుకునేందుకు వెళ్లలేక పోతున్నాను అని కీలక ప్రకటన చేసింది. ఉపాసన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారడంతో అది చూసినటువంటి ప్రేక్షకులు అందరూ కూడా గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తూ మెగా కోడలు అయినటువంటి ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు ది గ్రేట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం “పెద్ది” సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read also : కామారెడ్డి జిల్లాలో ఘోరమైన ఘటన.. కోపంతో ఓడిన అభ్యర్థిపై ట్రాక్టర్ తో ఢీ





