
క్రైమ్ మిర్రర్,పెద్దపెల్లి జిల్లా :-
నేర వివరాలు
1) 17-04-2024 నుండి తేది: 27-04-2024 రోజుల మధ్య చీకురాయి గ్రామంలో గల లంక దాసరి పోచమ్మ w/o నర్సయ్య, గారి ఇంటి తాళంను గుర్తు తెలియని దొంగలు పగలగొట్టి 1. One Gold Pusthel Thadu wg. (2 1/2) thulas, 2. One pair of ear rings wg. (1/4) thulas, 3. Raw gold wg. (5) thulas total wg. (7 3/4) thulas & W/Rs. 2,32,500/-, 4. Net cash Rs. 23,000/- లను దొంగలించుకొని వెళ్ళినారని లంక దాసరి పోచమ్మగారి పిర్యాదు పై పెద్దపల్లి పోలిస్ స్టేషన్ నందు Cr.No.192/2024U/Sec 457,380 IPC గా కేసు నమోదు చేయనైనది.
2) తేది: 22/06/2024 నాడు రాత్రి వేళలో పెద్దపల్లి రైల్వే కాలనీ లోగల ఎనగందుల రమాదేవి w/o శ్రీనివాస్ అను వారి ఇంటి తాళంను గుర్తు తెలియని దొంగలు I. (8 1/2) తులాల బంగారు ఆభరణాలు II. 22 తులాల బంగారు ఆభరణాలు మరియు III. Smart watch & IV. ఐదు Cell phones ను దొంగలించుకొని వెళ్ళినారని ఆమె పిర్యాదు పై పెద్దపల్లి పోలిస్ స్టేషన్ నందు Cr.No.273 /2024, U/Sec 457,380 IPC గా కేసు నమోదు చేయనైనది.
పట్టుబడిన నిందితుల వివరాలు:
1: MD గౌస్ పాషా, s/o యూసఫ్, వ!!: 22 సం!!, కులం: ముస్లిం, r/o పెద్దపల్లి
2: మేకల లాలూ ప్రసాద్ యాదవ్ S/o సదయ్య, వయస్సు 21 సii లు, వృత్తి: కూలీ, R/o H. No. 6-54, పెగడపల్లి గ్రామం, కాల్వశ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా
స్వాదీనం చేసుకొన్నా వాటి వివరాలు:
1) MD గౌస్ పాషా వద్ద నుండి 1). బంగారు నెక్లెస్ (15) గ్రాములు, 2). ముద్ద బంగారం(05) గ్రాములు
2) మేకల లాలూ ప్రసాద్ యాదవ్ వద్ద నుండి బంగారు చైను (10) గ్రాములను స్వాధీనం చేసుకోనైనది.
నేర విధానం: పెద్దపల్లి బస్సు స్టాండ్ ఏరియా లో ఉండే MD గౌస్ పాషా, ఇతడు గతంలో బెల్లంపల్లి, మంచిర్యాల్ ఏరియా లో దొంగతనాలు చేసి, పట్టుబడి జైలు కి కూడా వెళ్ళినాడు. ప్రస్తుతం పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద గల హోటల్ నందు స్వీపర్ గా పని చేస్తున్నాడు. మేకల లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క స్వస్థలం పెగడపల్లి గ్రామం, కల్వశ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. అతని చిన్న తనంలోనే తండ్రి చనిపోయినాడు. అతని ఒక అక్క మరియు అమ్మలతో కలసి గత (7) సంవత్సరాల నుండి పెద్దపల్లికి వచ్చి ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు MD గౌస్ పాషా మరియు మేకల లాలూ ప్రసాద్ లు మంచి స్నేహితులు. వారు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగాతనలనే ప్రవ్రుత్తి గా ఎంచుకున్నారు. వారు పగటి పూట పెద్దపల్లి పట్టణం లో మరియు గ్రామాలలో తిరుగుతూ తాళాలు వేసి వున్నా ఇండ్లను గుర్తిస్తూ రాత్రి సమయంలో అట్టి ఇంటి తాళాలను పగలకొట్టి ఇంటిలోగల బంగారు మరియు వెండి ఆభరణాలను దొంగలించుకొని వాటితో జల్సాలు చేసేవారు. వారు అదేవిధంగా చీకురాయి గ్రామం లో , రైల్వేకాలనీ ఏరియాలో పైన పేర్కొన్న రెండు దొంగతనాలకు పాల్పడినారు.
Read More : ఫిరోజ్ గాంధీ నిజంగానే ముస్లిమా!… బండి సంజయ్ చెప్పింది నిజమా?.. అబద్దమా?
పెద్దపల్లి సబ్ డివిజన్ నందు ప్రాపర్టి కేసుల చేదన మరియు నియంత్రణ కోసం పెద్దపల్లి ACP, G.కృష్ణ గారు పెద్దపల్లి CI- ప్రవీణ్ కుమార్ గారి అద్వర్యంలో రెండు టీం లను ఏర్పాటు చేయగా, పెద్దపల్లి CI- ప్రవీణ్ కుమార్ సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు MD గౌస్ పాషా, మేకల లాలూ ప్రసాద్ యాదవ్ లను పట్టుకోవడం జరిగినది.
రెండు కేసు లను చాకచక్యంగా టెక్నాలజీ ని ఉపయోగించుకుని చేదించిన CI- K. ప్రవీణ్ కుమార్, SI- లక్ష్మణ్ రావు, మల్లేష్, నరేష్, ASI-M.తిరుపతి, PCs-M.రాజు, K.ప్రభాకర్, D.రమేష్ లను ACP, G.కృష్ణ గారు అభినందించడం జరిగింది.
Read More : దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం!… స్పందించిన నరేంద్ర మోడీ?