Sunday, March 22, 2026
HomeతెలంగాణStrict Traffic Rule: ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్/ఆర్సీ సీజ్!

Strict Traffic Rule: ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్/ఆర్సీ సీజ్!

Crackdown on Traffic Violators: కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం.

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాలని, లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది.

ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంద. ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పోలీస్ శాఖ అధికారులు తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments