Bus Accident In Karnataka: పండుగ పూట ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రమాదంలో 20 మంది సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. చిత్రదుర్గ వద్ద హిరియూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం
ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 20 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
More than 10 people burnt alive when a truck hit a private #sleeper bus resulting in both bus and truck catching fire at Gorlattu in #Hiriyur of #Chitradurga district in early hours of Thursday. The bus was on its way to #Gokarna from #Bangalore.@XpressBengaluru pic.twitter.com/l1cEexDktU
— Subash_TNIE (@S27chandr1_TNIE) December 25, 2025





