
-
ఆగస్టు 21వరకు కొనసాగనున్న సమావేశాలు
-
నెలరోజుల పాటు వాడీవేడి చర్చలకు అవకాశం
క్రైమ్‌మిర్రర్, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. వచ్చేనెల 21వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పలు కీలక బిల్లులు ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే ఛాన్సుంది. జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ సంపద, స్థలాలు, భూ పరిరక్షణ, నిర్వహణ బిల్లు, గనులు, ఖనిజాల సవరణ బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, మణిపూర్ వస్తు సేవల సవరణల బిల్లు, జన్ విశ్వాస్ సవరణ బిల్లు వంటి బిల్లులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
వీటీతో పాటు ఐటీ బిల్లు-2025ని కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలోనే సెలెక్ట్ కమిటీకి పంపారు. అలాగే మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆమోదానికి కేంద్రం అనుమతి కోరనుంది. ఇవే కాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులనూ లోక్‌సభ ముందుకు తేనుంది కేంద్రం.
ఇక, ఈ సమావేశాల్లో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య వాడివేడి చర్చలు సాగనున్నాయి. బిహార్ ఎన్నికల జాబితా వివాదం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ మధ్య యుద్ధం విరమణ అంశాలపై చర్చలు సాగే అవకాశముంది.
Read Also: