
నారాయణపేట , క్రైమ్ మిర్రర్:-
నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో గత నెల రోజుల నుంచి విచ్చలవిడిగా కోతులు గల్లీలో తిరుగుతున్న ఏ మున్సిపాలిటీ సిబ్బంది ఏం మాత్రం పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రోజు బైరం దస్తప్ప అనే యువకుని పై కోతుల మంద దాడి చేశాయి. దీంతో పక్కనే ఉన్నటువంటి స్థానికులు హుటా హుటిన నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడు అరచేతికి అలాగే భుజం దగ్గర తీవ్రంగ గాయాలైనట్లు తెలుస్తుంది. అధికారులు స్పందించి ప్రజలను కాపాడాలని పలువురు మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. మొన్నటి వరకు కుక్కలు బెడత… తాజాగా మళ్లీ కోతుల బెడత పట్టుకుంది.
Read also : యూరియా కోసం రోడ్డెక్కిన పిల్లి రామరాజు.. రైతులతో కలిసి ఆందోళన!
Read also : నా బాధ ఏంటని ఒక్కసారైనా అడిగావా?.. సొంత అన్న పై విమర్శలు చేసిన కవిత!