తెలంగాణ

పోలీసులకు గన్ అప్పగించిన మోహన్ బాబు?

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్ అనేది పోలీసులకు అప్పగించారు. హైదరాబాదు నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం లోని రంగంపేట లో ఉన్న తన యూనివర్సిటీ కి ఇవాళ చేరుకున్నారు. అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తన లైసెన్సు గన్నును PRO ద్వారా డిపాజిట్ అనేది చేయించారు. కాగా ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు చెల్లరేగిన సందర్భంలో మోహన్ బాబును గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ లోని పోలీసులు ఆయన్ను ఆదేశించడంతో ఇవాళ తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్నును పోలీసులకు అప్పగించారు.

రేపు మరో వాయుగుండం!… ఏపీలో నాన్ స్టాప్ వర్షాలే?

అయితే గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు మరియు మంచు మనోజ్ మధ్య గొడవలు చలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం నుండి తెగ సంచలనంగా మారిపోయాయి. తండ్రి, కొడుకులు ఒకరిపై ఒకరు దాడులతో పాటు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నే మీడియాతో మాట్లాడుతున్న మోహన్ బాబు ఒక మీడియా జర్నలిస్ట్ పై దాడికి పాల్పడగా అతనికి గాయాలయ్యాయి. ఇక ఈ సందర్భంలోనే పోలీసులు జోక్యం చేసుకొని తన దగ్గర ఉన్నటువంటి గన్నును పోలీసులకు అప్పచెప్పాలని కోరారు.

పరామర్శ ఓకే!.. కానీ చావుతో పోరాడుతున్న పిల్లాడి పరిస్థితి ఏంటి?

ఇక వీళ్లిద్దరి గొడవలు నేపథ్యంలోనే మంచు విష్ణు కూడా ఫారిన్ నుండి ఇంటికి చేరుకొని గొడవలకు గల కారణాలు తెలుసుకున్నాడు. మరోవైపు మంచు లక్ష్మి విదేశాల్లో ఉంటూనే గొడవలకు గల కారణాలను తెలుసుకుంది. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య గొడవలు అనేవి ఆస్తి విషయంలోనూ అలాగే మంచు మనోజ్ చేసుకున్నటువంటి భార్య విషయంలోనే వచ్చాయంటూ చాలా మంది చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే వీళ్లిద్దరి మధ్య గొడవలు కొంచెం సద్దుమణిగినట్లు అనిపిస్తున్నాయి.

ఆ రైతులకు 12 వేల రూపాయలు.. డిసెంబర్ 28న జమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button