
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. మంగళవారం మార్కాపురం డి.ఎస్.పి నాగరాజు దోర్నాలలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ… శ్రీశైలం లో ప్రసిద్ధిగాంచినటువంటి మల్లికార్జున స్వామి దర్శనానికి ఈ నెల 16వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న కారణంగా 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా దోర్నాలలో శ్రీశైలం వెళ్లే వాహనాలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఇక కర్నూలు మీదగా వెళ్లేటువంటి భారీ వాహనాలను పెద్దారవీడు అలాగే కుంట నుంచి గిద్దలూరు వైపుగా మళ్లిస్తున్నామని తెలిపారు. కాబట్టి ఈ వాహనదారులు ఈ ఆంక్షలును దృష్టిలో ఉంచుకొని పోలీసులు తెలిపిన మార్గాన వెళ్ళవలసిందిగా కోరారు. కాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంలో పర్యటించనున్న కారణంగా ఇప్పటికే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలోని అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 7500 మంది పోలీసులతో ఆరోజు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు. ఇప్పటికే శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గం మొత్తం కూడా శుభ్రం చేసామని… పదుల సంఖ్యల డ్రోన్లతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు రానున్నారు.
Read also : నాకు ప్రజలే ముఖ్యం.. పదవులు కాదు : రాజగోపాల్ రెడ్డి
Read also : సబ్సిడీపై రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ!