
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మోడీ పర్యటనలో భాగంగా ఇవాళ, రేపు కర్నూలు అలాగే నంద్యాల జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. మోడీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా డీఈవోలు సెలవులు ఇస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు సెలవులు పట్ల ఇప్పటికీ సమాచారం కూడా అందించినట్లుగా అధికారులు తెలియజేశారు. మరోవైపు స్కూళ్లలో FA-2 పరీక్షలు జరుగుతున్నాయి. అయినా కూడా విద్యార్థులకు సెలవులు ప్రకటించి ఈ పరీక్షలను 17 మరియు 18వ తేదీలలో నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాల్ కు డీఈవో అధికారులు సూచించినట్లు సమాచారం. రేపు శ్రీశైలంలో మోదీ పర్యటించబోతున్నట్లు పియంఓ నుంచి ఇప్పటికే అధికారులకు సమాచారం అందింది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీశైలం రహదారి అలాగే మల్లికార్జున దేవాలయంలో కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. డ్రోన్లు ఎగరవేసి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా రేపు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కర్నూలు అలాగే నంద్యాల జిల్లా ప్రజలు మోడీ పాల్గొనే సభకు హాజరుకావాలని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూటమి కార్యకర్తలు అలాగే నాయకులు పెద్ద ఎత్తున తోడ్పడాలని కోరారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలకు కూడా సెలవులు ఇవ్వడంతో ఒకవైపు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరోవైపు అధికారులు వస్తున్నారని విద్యార్థులకు సెలవులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు.
Read also : పక్కకు తప్పుకున్న శ్రీ లీల.. అఖిల్ కు జోడిగా సరికొత్త హీరోయిన్
Read also : మోడీ శ్రీశైలం పర్యటన.. భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన అధికారులు!