తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్.

క్రమశిక్షణ కమిటీ నోటీసులను పట్టించుకోని తీన్మార్ మల్లన్న.

వివరణకు గడువు ఇచ్చిన స్పందించని ఎమ్మెల్సీ.

కుల గణన నివేదికను కాల్చి వేయడం పై కాంగ్రెస్ ఫైర్.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ కట్టుబాటును దాటిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు. బీసీ కుల గణన ప్రతులను చింపడంతో పాటు, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తీన్మార్ మల్లన్న అసభ్య పదజాలంతో దూషించిన వ్యాఖ్యలపై ఏఐసీసీ సీరియస్ అయింది. ఇదే విషయమై తీన్మార్ మల్లన్న కు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాష్ నోటీస్ జారీ చేసింది. షోకాజ్ నోటీస్ కు , సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేయడమే కాకుండా, అదేపనిగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను కట్టుబాట్లను ఉల్లంఘించిన తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు వేటు పడింది.

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే, తీన్మార్ మల్లన్న పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్ర కాంగ్రెస్లో ఇకపై క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని, గ్రూప్ తగాదాలను ప్రోత్సహించేది లేదని మీనాక్షి నటరాజన్ చెప్పకనే చెప్పినట్లయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా దీపాదాస్ మున్షిని తప్పించి, పార్టీకి, ప్రత్యేకించి గాంధీ కుటుంబానికి అత్యంత విదేయరాలైన మీనాక్షి నటరాజన్ నియమించడం పరిశీలిస్తే, ఇక పార్టీ లైన్ మీరి ఎవరి తోక జాడించినా , వారిపై చర్యలు తప్పవనే పరోక్ష సంకేతాలను ఇచ్చినట్లు అయింది.

  1. మీనాక్షి నటరాజన్‌ రాకతో టీకాంగ్రెస్‌లో మార్పు వస్తుందా..? – పార్టీలో కుమ్ములాటలు తగ్గుతాయా?

  2. సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు..? – దీని వెనకున్న పొలిటికల్‌ స్ట్రాటజీ ఏంటి..?

  3. విషాదమును మిగిల్చిన SLBC టన్నెల్ సంఘటన.. 8 మంది కార్మికులు మృతి!..

  4. విషాదమును మిగిల్చిన SLBC టన్నెల్ సంఘటన.. 8 మంది కార్మికులు మృతి!..

  5. ఇకపై గ్రామ సర్వేయర్లకు హాజరు తప్పనిసరి : ఏపీ ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button