
క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్:-రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్ లాల్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి శాసన మండలి బిజేపి బలపరిచిన అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరు అయి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి రాబోవు ఎమ్మేల్సీ ఎన్నికల్లో టిపియుఎస్ బలపరిచిన అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్ధించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ.. నిరుద్యోగ, ఉద్యోగ, ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విద్యారంగ సంక్షేమానికి ఉపయోగపడేలా శాసన మండలిలో పెద్దన్న పాత్ర వహించి సమస్యలు పరిష్కారానికి ముందుండి పోరాడి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం దిశగా ముందుండే వ్యక్తి పులి సరోత్తం రెడ్డి కావున ఈనెల 27వ తేదీన జరుగబోయే శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి ఉపాద్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పులి సరోత్తం రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు గుగులోతు స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవింద్రాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, కారుపోతుల యాదగిరి, గంగుల రాజ్ కుమార్, కత్తి హరీష్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో ఎనిమిది నెలలు: సీఎం
ఏయ్ కమిషనర్.. పబ్లిక్ లో రెచ్చిపోయిన హరీష్ రావు
ఆరిపోయే దీపంలా కేటీఆర్ మాటలు!.. కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే?